ప్రభాస్ ఫౌజీ సినిమా దసరా కి రాబోతోందా???

Spread the love

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక సినిమా ‘ఫౌజీ’. క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంతో ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ అసాధారణమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వబోతోందన్న అంచనాలు ఇప్పటికే గట్టిగా ఏర్పడ్డాయి. విడుదలైన ప్రీ-లుక్, టైటిల్ పోస్టర్లు సోషల్ మీడియాలో భారీ బజ్‌ను సృష్టించడమే కాదు… అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచేశాయి. అనుకున్న సమయానికే  పూర్తి చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలకు దసరా పండుగను టార్గెట్ చేయడం విశేషం. హాలిడేస్ సీజన్ కావడం తో, సంక్రాంతి తర్వాత స్టార్ హీరోల సినిమాలకు అత్యంత కీలకమైన రిలీజ్ విండోగా మారింది. అదే అవకాశాన్ని ‘ఫౌజీ’ కోసం వినియోగించుకోవాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను  ప్రభాస్‌ అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందని సమాచారం. మొత్తానికి ‘ఫౌజీ’ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ మైలురాయిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోస్టర్లతోనే ఈ స్థాయి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టించబోతోందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.