బెంగాల్ లో బీజేపీ వస్తే 45 రోజుల్లో బోర్డర్ ఫెన్సింగ్:కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Spread the love

పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేస్తామని స్పష్టం చేశారు. ఎలక్షన్స్ లో ప్రయోజనం పొందడం కోసం చొరబాటులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఉత్తర 24 పరగణ జిల్లాలోని బ్యారక్ పూర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో చొరబాట్లు జరుగుతున్న తీరు దేశమంతటికీ సమస్యగా మారిందన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా బోర్డర్ ఫెన్సింగ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు టీఎంసీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని దుయ్యబట్టారు. అక్రమ చొరబాటుదారులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు, అధికారులు అక్రమ వలసలను అడ్డుకోవడం లేదు. దీంతో నకిలీ డాక్యుమెంట్స్ తో వారు దేశమంతా వెళుతున్నారని ఇటువంటి పరిస్థితులలో బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం రావడం అవసరమని స్పష్టం చేశారు.