‘విత్ లవ్’ ట్రైలర్ విడుదల

Spread the love

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వంటి విలక్షణమైన చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతను హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మాణంలో ఓ కొత్త ప్రేమకథా చిత్రం రాబోతోంది. ‘విత్ లవ్’ పేరుతో రూపొందిన ఈ సినిమా  ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా తెలుగు ట్రైలర్‌ను మూవీ టీమ్  విడుదల చేసింది. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, ఇదొక క్లీన్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అనిపిస్తోంది. యువతను ఆకట్టుకునే ఎమోషన్స్, బ్యూటిఫుల్ విజువల్స్, ఆహ్లాదకరమైన సంగీతం ట్రైలర్‌ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌. కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేని మురుగన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.