2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..హైలెట్స్ ఇవే

Spread the love

2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది. నిర్మలా సీతారామన్ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ  భారత ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోందన్నారు.సంస్కరణలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 7శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

మూడు కర్తవ్యాలతో ఈ బడ్జెట్ను తీర్చిదిద్దామని అన్నారు. పవిత్ర మాఘపూర్ణిమ రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.  ప్రపంచ మార్కెట్లతో భారత్ ను  అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నామన్నారు. వికసిత భారత్ లో భాగంగా యువత ఆకాంక్షలను అద్దం పట్టేలా బడ్జెట్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందని  నిర్మలా సీతారామన్ వివరించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఆధారిత బడ్జెట్ గా అభివర్ణించారు. 

నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు.  2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉందని తెలిపారు. జీఎస్టీ, లేబర్ కోడ్ తదితర రంగాల్లో సంస్కరణలు తెచ్చామని తెలిపారు. 

బడ్జెట్ లోని ప్రధానాంశాలు:

10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం

ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ

రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం

ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 మూడు కొత్త విద్యా సంస్థల స్థాపన

సెమీ కండక్టర్ 2.0 విధానం

సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ. 40వేల కోట్లు

రేర్ ఎర్త్ మినరల్స్ కోసం కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ఖనిజాల వెలికితీతకు పథకం

దేశంలో కొత్తగా మూడు రసాయన పార్కుల స్థాపన

భవన నిర్మాణరంగలో నిర్మాణరంగ పరికరాల డెవెలప్మెంట్ 

ప్రపంచస్థాయి కంటైనర్ తయారీ కార్పొరేషన్ ఏర్పాటు

నేషనల్ ఫైబర్ విధానం దిశగా అడుగులు వేస్తాం

జౌళి రంగ విస్తరణ, ఆధునీకీకరణ, ఉపాధి దిశగా మరిన్ని అడుగులు

 హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు

ఇండస్ట్రీస్ తో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్  అనుసంధానం

మెగా టైక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు

జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ

మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు

గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయింపు

ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు

ముంబయి-పుణె

పుణె-హైదరాబాద్

హైదరాబాద్-బెంగళూరు

హైదరాబాద్-చెన్నై

చెన్నై- బెంగళూరు

ఢిల్లీ-వారణాసి

వారణాసి -సిలిగుడి

ప్రవాస భారతీయులకు శుభవార్త 

భారత స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం

మూలధన వ్యయం రూ.12.2లక్షల కోట్లకు పెంపు

5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి

5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనలు సంస్థల ఏర్పాటు

సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం

కొత్తగా డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు

వారణాసి, పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారం ఏర్పాటు

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు

20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్ల నియామకం

సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయింపు

స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ.2వేల కోట్ల ఫండ్ ఏర్పాటు

ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్ఎంఈలకు చేయూత

దేశంలో మూడు ఆయుర్వేద  హాస్పిటల్స్ ఏర్పాటు

ఆయుష్ కేంద్రాల అప్ గ్రేడేషన్

ట్రెడిషనల్ మెడికల్ రీసెర్చ్ కోసం  జామ్ నగర్ లో  రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు

ప్రైవేటు రంగంలో పశు వైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం

యువత కోసం మెడికల్ సెక్టార్ లో కొత్త కోర్సుల ఏర్పాటు

పులికాట్ లో  పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు

టెక్స్ టైల్  సెక్టార్ కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం

టెక్స్ టైల్  సెక్టార్  కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు

నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు

15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి

ఖేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడాభివృద్ధి

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత

ట్రెడిషనల్ మెడిసిన్ లో రీసెర్చ్ లపై దృష్టి

తూర్పు భారతంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు

సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి

రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగింపు

సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువు పెంపు

డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు

విదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గింపు

ఎడ్యుకేషన్, మెడిసిన్ పై టీడీఎస్ 5శాతం నుంచి 2శాతానికి తగ్గింపు

మానవ వనరులు  సరఫరా చేసే సంస్థల 1 లేదా 2శాతం టీడీఎస్

చిన్న పన్ను చెల్లింపు దారుల కోసం ప్రత్యేక పథకం

ఎల్ఆర్ఎస్ కింద టీడీఎస్ 5 నుంచి 2శాతానికి తగ్గింపు

గతేడాదితో పోలిస్తే 0.1శాతం తగ్గిన ద్రవ్యలోటు

2026-27లో ద్రవ్యలోటు 4.3శాతానికి తగ్గించాలని టార్గెట్ 

దేశీయ వాటర్ వేస్ లో  ఆధునిక విధానాలు

మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కూలీలకు ఉపయోగపడేలా నిధులు

నేషనల్ వాటర్ వే ట్రాన్స్పోర్ట్  కార్యక్రమంలో భాగంగా తూర్పు-పశ్చిమాల అనుసంధానం

హెరిటేజ్ ఇండస్ట్రీల  క్లస్టర్ల పునరుద్ధరణ

పులికాట్ లో పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు

టెక్స్టైల్ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం

కొబ్బరి ఉత్పత్తి కోసం కొబ్బరి ప్రోత్సాహక పథకం

500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు

పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు

వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం

తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం

కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు ప్రోత్సాహకాలు

జీడిపప్పు, కోకో ప్రొడక్షన్ కోసం ప్రత్యేక చర్యలు

గంధం చెట్ల వనాలు, బాదం, పైన్నట్స్ కోసం స్పెషల్ స్కీం 

దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన

దివ్యాంగులకు చేయూతగా దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన

మానసిక వ్యాధుల చికిత్సకు NIMHANS-2. రాంచీ, తేజ్పుర్లలో నేషనల్ మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ అప్ గ్రెడేషన్

తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

ఆస్ట్రానమీ  పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచడమే లక్ష్యంగా చర్యలు

నేషనల్ లార్జ్  సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఏర్పాటు

హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్-2 ప్లానిటోరియం ఏర్పాటు

తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ. లక్షా 4వేల కోట్ల నిధులు

చిన్న ఇన్వెస్టర్ల  ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం

కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22శాతం పన్ను

నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30శాతం పన్ను

భారత్లో డేటా సెంటర్ల ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త

2047 వరకూ డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే

ట్యాక్స్ హాలిడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం.