ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకి కవలలు జన్మించారు. ఒక బాబు ఒక పాపా… ఈ న్యూస్ తో కొణిదెల, కామినేని కుటుంబాల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. జనవరి 31న ఉపాసన ఒక మగబిడ్డకు, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను రామ్ చరణ్ తండ్రి, మన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా తెలియజేస్తూ చిరంజీవి ఎమోషనల్ గా స్పందించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2012లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు పదేళ్ల తర్వాత, 2023లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘క్లీంకార ’ పేరు పెట్టె క్షణాన్ని కూడా ఎంతో అద్భుతంగా చెంచు సంప్రదాయం లో జరిపారు. ఆ చిన్నారి రాకతోనే కుటుంబంలో ఆనందం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఆనందం మరింతగా పెరిగి, కవల పిల్లల రూపంలో కుటుంబాన్ని మరింత సంపూర్ణం చేసింది. ఈ శుభవార్తతో కొణిదెల కుటుంబం మాత్రమే కాదు, తెలుగు సినీ అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. రామ్ చరణ్ కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో, వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి మధురమైన క్షణాలు రావడం నిజంగా ప్రత్యేకమని చెప్పాలి. చిన్నారుల రాకతో ఈ కుటుంబంలో ప్రేమ, ఆనందం, ఆశీర్వాదాలు మరింతగా పంచిపోతాయని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.