రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అల్లు అర్జున్ విషెస్

Spread the love

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారికి కవలలు జన్మించారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. మరోసారి అద్భుతమైన తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసనలకు నా అభినందనలు. కుటుంబంలో అంతటా ఆనందం, సంబరాలు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి గారి ముఖంలో గర్వం, సంతోషం వెలిగిపోతున్నాయి. వారిని, మొత్తం కుటుంబాన్ని నవ్వుతూ చూడటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చిన్నారులు తమ రాకతో ప్రపంచంలోకి మరింత సంతోషాన్ని తీసుకొచ్చారు. ఈ అందమైన కొత్త ఆరంభం, రెట్టింపు ప్రేమను మరియు రెట్టింపు సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.