వైసీపీ ట్రాప్ లో పడొద్దు…శ్రేణులకు టీడీపీ అధినేత సూచనలు

Spread the love

వైసీపీ రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం లేదన్న అసహనంతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు అసభ్య వ్యాఖ్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. చేసిన పాపాలను డైవర్ట్ చేయాలన్నదే వైసీపీ  కుట్ర. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన అజెండా అని అన్నారు. అది వైసీపీ  నేతలకు నచ్చడం లేదు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామన్నారు. టీడీపీ  కార్యకర్తలు సంయమనం పాటించేలన్నారు. వైసీపీ  ట్రాప్లో పడొద్దని సూచించారు. అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ  పుట్టింది. ఆ పార్టీ ట్రాప్ లో పడితే వారికీ.. మనకీ తేడా ఉండదన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్లోటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.