ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌కు దక్కిన భారీ విజయం:మంత్రి నారా లోకేష్

Spread the love

అమెరికా సుంకాలను 25% నుండి 18%కి తగ్గించడం వల్ల భారతదేశ ఎగుమతులు మరియు తయారీ రంగానికి గొప్ప ఊతం లభిస్తుందని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. భారత్-యుఎస్ ట్రేడ్ డీల్ నేపథ్యంలో టారిఫ్ లు తగ్గుతూ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌కు దక్కిన భారీ విజయమని కొనియాడారు.  దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నుండి జరుగుతున్న సముద్ర ఆహార ఎగుమతులు (మెరైన్ సీఫుడ్), ఎంఎస్ఎంఈలు (MSME), వ్యవసాయ ఎగుమతులు మరియు కొత్తగా వస్తున్న తయారీ కేంద్రాలకు నేరుగా ప్రయోజనం చేకూరడమే కాకుండా, భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కీలకమైన విజయం సాధించినందుకు చర్చలు జరిపిన  బృందాలకు, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు, అలాగే ఉభయ దేశాల నాయకత్వానికి అభినందనలు తెలిపారు.