భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రకటన నేపథ్యంలో ప్రధాని మోడీకి ఎన్డీయే ఎంపీల అభినందనలు 

Spread the love

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నేడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అమెరికా-యూ.ఎస్. ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ఎన్డీయే నేతలు ప్రధాని నరేంద్రమోడీని సన్మానించారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ప్రధాని చేసిన కృషికి అభినందించారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గింపు వర్తించనున్న సంగతి తెలిసిందే. దీనిపై  ప్రధాని నరేంద్రమోడీ ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాన్నీ తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్‌ తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను (Tariffs) 18 శాతానికి తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 140 కోట్ల భారత ప్రజల తరపున ప్రెసిడెంట్ ట్రంప్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మరియు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు, అది మన ప్రజలకు మేలు చేయడమే కాకుండా, పరస్పర సహకారం కోసం అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇక ఎంపీలకు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన  తీరుపై దిశానిర్దేశం చేశారు.