నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మూడు రికార్డులు బద్దలు కొట్టి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో స్నాచ్ లో 89 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ లో 116 కేజీలు లిఫ్ట్ చేసి మొత్తంగా 205 కేజీలు లిఫ్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈక్రమంలో తన పేరిట ఉన్న స్నాచ్ (88),క్లీన్ అండ్ జెర్క్ (115), మొత్తం 203 కేజీల రికార్డ్ ను అధిగమించింది.