ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించాయి. మహిళల గ్రూప్- మొదటి పోరులో భారత్ 5-0తో మయన్మార్ పై విజయం సాధించింది. తన్విశర్మ 21-13,21-16తో తుజార్ పై , రక్షిత శ్రీ 21-12, 21-6తో ఇయంట్ చిట్ పై, మాళవికా బాన్సోద్ 21-19, 21-12తో లిన్ లెట్ పై విజయం సాధించారు. ప్రియ- శ్రుతి 21-15, 21-16తో సు లాట్- తుజార్ పై, గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ 21-8, 21-6తో పూ-లెట్ పై నెగ్గి భారత్ కు విజయాన్ని అందించారు. ఇక పురుషుల గ్రూప్-సి తొలి మ్యాచ్ లో భారత్..సింగపూర్ ను ఓడించింది. మొదట సింగిల్స్ లో లక్ష్యసేన్ 21-16, 19-21, 16-21తో లో కీన్ యీ చేతిలో పరాజయం చెందగా..డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-10, 21-8తో వెస్లీ-కుబో ద్వయంపై గెలిచి స్కోరు సమం చేసింది. తర్వా ఆయుష్ శెట్టి 21-17, 21-15తో జియా హెంగ్ పై గెలిచి భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో డబుల్స్ పృథ్వీ-సాయి ప్రతీక్ జోడీ 21-8, 21-23, 20-22తో డౌనోవాన్ – జో జీ జోడీ చేతిలో పరాజయం చెందడంతో మళ్లీ స్కోర్లు సమమయ్యాయి. నిర్ణయాత్మక సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 21-16తో జియా వీయ్ పై గెలిచాడు దీంతో భారత్ విజయం సాధించింది.