ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. కాగా, ఇటీవల ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, ఆఫీస్‌ను ఆ పార్టీ అధినేత జగన్ నేడు పరిశీలించిఅనంతరం అంబటి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కేంద్రానికి సంబంధించిన NDDB, NDRI ల్యాబ్‌లే తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు ఇచ్చాక కూడా చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బాబుకు దేవుడంటే భక్తి, భయం రెండూ లేవని ఆరోపించారు. చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుడికెళ్లి వస్తున్న అంబటి రాంబాబును పోలీసుల సమక్షంలోనే కర్రలు, రాడ్లతో అడ్డగించి బూతులు తిట్టడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు చేసిన తప్పేమిటి? విడదల రజినమ్మ చేసిన తప్పేమిటి? జోగి రమేష్ చేసిన తప్పేమిటి? భూమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి? కాకాణి గోవర్ధన్ చేసిన తప్పేమిటి? బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి? అని ప్రశ్నించారు.