గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా, హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని… ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా… వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు  అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా వీరు  నియమితులయ్యారని ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.