స్పేస్ లో డేటా సెంటర్లు.. 10 లక్షల శాటిలైట్లు:మస్క్ కొత్త ఆలోచనలు

Spread the love

టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రణాళికలు ప్రకటించారు. స్పేస్ లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆర్బిట్ లోకి 10 లక్షల శాటిలైట్ లను పంపించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రణాళికలకు ఆర్థిక సహకారం కోసం స్పేస్ ఎక్స్ లో తన ఏఐ బిజినెస్ ను విలీనం చేశారు. ఈ రెండిటితో కలిసి ఏర్పడిన సంస్థ త్వరలోనే ఐపీవోకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లకు భారీ స్థాయిలో ఎలక్ట్రిక్, కూలింగ్ సిస్టమ్ లు అవసరం. ఇవి భూమిపైన పెద్ద సంఖ్యలో ఏర్పాటై ఉన్న డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ వినియోగం మరింత పెరిగిన తరువాత ఈ డేటా సెంటర్లు సరిపోవు స్పేస్ బేస్డ్ ఏఐ ఒక్కటే దీనికి పరిష్కారం.  అందుకే స్పేస్ లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. సోలార్ పవర్ తో అవి పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక స్పేస్ బేస్డ్ డేటా సెంటర్లకు భారీగా శాటిలైట్లు అవసరం. దానికోసమే 10 లక్షల శాటిలైట్లు పంపిస్తామని వివరించారు. ఇక మస్క్ ప్రణాళికలకు ఆర్థిక పరమైన, సాంకేతికపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.