వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా, ఆయనకు మరో కేసులో గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. గతంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ ఆందోళన సందర్భంగా అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో అంబటిపై కేసు నమోదైంది. రాజమండ్రి జైలు నుంచి పీటీ వారెంట్ పై అంబటి రాంబాబును గుంటూరు తరలించిన పోలీసులు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. మరోవైపు పోలీసుల కస్టడీ పిటిషన్, అంబటి బెయిల్ పిటిషన్లపైనా కోర్టులో విచారణ జరగనుంది. అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తారు.