తెలంగాణకి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి:సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు కళ్ళముందు ఉన్న గతం, భవిష్యత్ ను  దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.  మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.  పన్నెండేళ్లుగా కేంద్రంలో మోదీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేంటి అని ప్రశ్నించారు.  కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది తెలంగాణ ప్రజలను, ఓటర్లను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్లు మంజూరు చేశామని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేస్తోందన్నారు. . ఈ వివక్షపై మోదీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, నీతి అయోగ్ ను  ఏ రోజైనా మీరు అడిగారా? అని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించారు. అది వదిలేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లుగా మాట్లాడటం మీకు న్యాయమా? రాజ్యాంగబద్దంగా ఆటో మోడ్ లో రాష్ట్రాలకు వచ్చే నిధులు అవే వస్తాయి. దీనికి వీళ్లు చేసిందేం లేదు.. వీళ్ల రికమెండేషన్లు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారంతో తెలంగాణకు ఏ ఒక్కటీ ఇవ్వలేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదు. మూసీకి అదనంగా  గ్రాంటు తీసుకురాలేదు. మెట్రోకు నిధులు తీసుకురాలేదు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక నిధులు తేలేదని అన్నారు. కనీసం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు తెచ్చారా ఓట్లు వేయించుకోవడం.. సీట్లు తెచ్చుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేం లేదని విమర్శించారు. ఇక బీ.ఆర్.ఎస్ గురించి మాట్లాడుతూ తెలంగాణలో గత పదేళ్లు బీఆరెస్ నే అధికారంలో ఉందని పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు సమస్యల పరిష్కారానికి బీఆరెస్ కు ఓటు వేయాలని అడుగుతున్నారు. సర్పంచ్ నుంచి మున్సిపల్ వరకు పెత్తనం మీరే చెలాయించారు ఇవాళ సమస్యలకు ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదా? అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఇపుడు మళ్లీ ఓట్లు అడుగుతున్నారన్నారు. దోపిడీకి అలవాటు పడ్డ ఇలాంటి వాళ్లకి ఓటు వేస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ, బీఆరెస్ లది 2023 వరకు విడదీయలేని అనుబంధమని నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, త్రిపుల్ తలాక్ కు మద్దతునిచ్చారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు.కాంగ్రెస్  అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేసింది మేమే కదా ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం. రేషన్ కార్డులు అందించి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాం. మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ.9 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. రైతు రుణమాఫీ చేసి, 9 రోజుల్లో 9 వేల కోట్లు బరితో భరోసా. పేదలకు నియోజకవర్గానికి  3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఇల్లు కట్టుకునే పేదలకు రూ. 5 లక్షలు అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.  తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.ఈ ప్రభుత్వం మీది… మీ కోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా నాదని రేవంత్ పేర్కొన్నారు.