పవన్ కళ్యాణ్ సినిమాలో ఇమాన్వి???

Spread the love

సోషల్‌మీడియాలో చిన్న చిన్న వీడియోలతో మొదలైన ఆమె ప్రయాణం… ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ సరసన హీరోయిన్‌గా నిలిచే స్థాయికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా మొదటి సినిమా విడుదల కూడా కాలేదు. అయినా ఇప్పటికే వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయంటే… ఇండస్ట్రీలో ఆమెపై ఎంతటి నమ్మకం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు… ఇమాన్వి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రభాస్‌ చిత్రం ‘ఫౌజీ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగా, చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌ సరసన కొత్త హీరోయిన్‌గా ఇమాన్వి ఎంపిక కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాల్లో అనుభవం ఉన్న కథానాయికలకే అవకాశాలు వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం పూర్తిగా కొత్త అమ్మాయిని నమ్మి అవకాశం ఇవ్వడం… దర్శకుడు హను రాఘవపూడి తీసుకున్న ధైర్యమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు.కథానాయికగా ఇమాన్వికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన రీల్స్‌, ఫోటోషూట్లు, స్టైలిష్‌ ప్రెజెన్స్‌ నెటిజన్లను ఆకట్టుకోవడంతో భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అదే ఆమెకు సినీ అవకాశాల దారిని తెరిచింది. సాధారణంగా సోషల్‌మీడియా స్టార్‌లకు సినిమా అవకాశాలు రావడం కొత్త విషయం కాదు. కానీ మొదటి సినిమానే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో రావడం మాత్రం నిజంగా అరుదైన విషయం. అందుకే ఇండస్ట్రీలో ఆమె పేరు ఒక్కసారిగా హైలైట్‌ అయింది. ఇంతలోనే మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించనున్న కొత్త ప్రాజెక్ట్‌లో కథానాయికగా ఇమాన్విని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశముందని టాక్‌. ఒకవేళ ఈ వార్త నిజమైతే… తొలి సినిమా విడుదల కాకముందే ఇద్దరు భారీ స్టార్‌ల సరసన నటించే అరుదైన రికార్డ్‌ను ఆమె సొంతం చేసుకున్నట్లే అవుతుంది. దీంతో ఇమాన్వి భవిష్యత్తుపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.