టీ20 ప్రపంచకప్ లో నెదర్లాండ్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. గ్రూప్-ఎ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఓడించినంత పని చేసిన ఈ టీమ్ రెండో మ్యాచ్ లో అత్యద్భుత ఆటతీరు కనబరిచి గెలుపును కైవసం చేసుకుంది. నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో నమీబియా పై ఘన విజయం సాధించింది. మొదట నమీబియా 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. లాఫ్టీ ఈటన్ (42; 38 బాల్స్ లో 1×4, 2×6) టాప్ స్కోరర్. ఫ్రెలింక్ (30), స్మిత్ (22) పర్వాలేదనిపించారు. డెలీడ్ (72 నాటౌట్; 48 బాల్స్ లో 5×4, 4×6) బ్యాటుతోనూ అదరగొట్టడంతో నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.
న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో యూఏఈ పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. మహ్మద్ వసీమ్ 66 (45; 4×4, 3×6) టాప్ స్కోరర్. ఆలీషాన్ షరఫు 55 (47; 5×4, 2×6) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫెర్ట్ 89 (42; 12×4, 3×6), ఫిన్ అలెన్ 84 (50; 5×4,5×6) రాణించడంతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 15.2 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది.
ఇక మరో మ్యాచ్ లో పాకిస్థాన్ అమెరికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఫర్హాన్ (73), బాబర్ అజమ్ (46), షాదాబ్ ఖాన్ (30) పరుగులు చేశారు. అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.