సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తో ఆకట్టుకున్న ఆకృతి దహియా, అంజుమ్ మౌద్గిల్

Spread the love

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో  ఆకృతి దహియా, అంజుమ్ మౌద్గిల్ మంచి ప్రదర్శన కనబరిచారు. ఆకృతి సిల్వర్ మెడల్, అంజుమ్ బ్రాంజ్ మెడల్స్ తో ఆకట్టుకున్నారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ లో  ఆకృతి (354.2) రెండు, అంజుమ్ (340.4) మూడో స్థానాల్లో నిలిచారు. కజకిస్తాన్ కు చెందిన సోఫియా షుజెంకో (358.2) ప్రపంచ రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా, ప్రపంచ జూనియర్, ఆసియా జూనియర్ రికార్డుల్ని సైతం సోఫియా తిరగరాసింది. జూనియర్ మహిళల 3 పొజిషన్లో ప్రాచి గైక్వాడ్ (353.3) గోల్డ్, కజకిస్తాన్ కు చెందిన తొమిరిస్ అమనోవా (351.4) సిల్వర్ , అనుష్క తోకుర్ (341.1) బ్రాంజ్  సాధించారు. ప్రాచి, అనుష్క, హేజెల్ల తో కూడిన భారత టీమ్  టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్  కైవసం చేసుకుంది.