తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ రోజు కొడంగల్ లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.