విద్యార్దులకు ఊరటనిచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు తక్షణ ఊరటనిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌ల కోసం ₹1,200 కోట్లను తాజా BROల (Budget Release Orders) ద్వారా విడుదల చేశారు. ఈమేరకు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ లో తెలిపారు. దీనిపట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి మరియు తల్లిదండ్రులకు నేను ఇచ్చే హామీ ఒక్కటే: చదువు విషయంలో ఎవరూ ఆటంకాలు ఎదుర్కోకూడదు. పాత బకాయిలన్నీ చెల్లించడంతో పాటు, ఇకపై సకాలంలో సహాయం అందేలా చూడటమే మా లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు. ధైర్యంగా చదువుకోండి – మీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని లోకేష్ భరోసానిచ్చారు.
naralokesh tdp fundsforstudents andhrapradesh