ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖల కలకలం

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. మావోయిస్టుల పేరుతో హెచ్చరికలతో ఈ లేఖలు వచ్చాయి. తొలుత కందుల దుర్గేశ్ కు వచ్చింది ​ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడంతో ఈ బెదిరింపుపై మంత్రి కందుల దుర్గేష్ వెంటనే స్పందించి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ లేఖ ఎక్కడి నుండి వచ్చింది? పంపిన వారు అసలు మావోయిస్టులేనా లేక ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ​ప్రజా ప్రతినిధులపై ఇలాంటి బెదిరింపులు రావడం భద్రతా పరంగా సరికొత్త చర్చకు తెర తీసింది. ప్రభుత్వం మంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. దుర్గేశ్ సహా  మరో ముగ్గురు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ పేషీలకు ఇదే రకమైన లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది.