ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు .సభకు హాజరయ్యారు.
అంతకుముందు శాసన సభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. ఇక గవర్నర్ ప్రసంగిస్తూ సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార సేవలో, చేనేతలకు ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్, కానిస్టేబుల్ ఉద్యోగాలు వేలాదిగా ఇచ్చాం.
గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సహా పునరుత్పాదక ఇంథనం ద్వారా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఏపీని క్లీన్ ఎనర్జీ ఎకనామిక్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
విద్యుత్ వినియోగదారులపై భారం వేయకుండా రూ.4,498 కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.
తొలిసారిగా ట్రూ డౌన్ విధానం ద్వారా ప్రజలపై యూనిట్ కు 13 పైసల చొప్పున విద్యుత్ భారాన్ని తగ్గించింది.
గతంలో తప్పుడు నిర్ణయాలతో ధ్వంసమైన ఏపీ విద్యుత్ రంగం ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడల్‌గా అవతరించింది
తక్కువ ధరతో డేటా సెంటర్లకు విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
సీఐఐ సదస్సు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఎంఓయూలు కుదిరాయి
వీటి ద్వారా 16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
14 ఎస్ఐపీబీ ల ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపి పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చి ఆ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది
కేంద్ర బడ్జెట్లో అరకు లోయ, పులికాట్ సరస్సుల వద్ద టూరిజం అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావించారు.
పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం సులభరీతిలో సేవలు అందిస్తోంది.
అలాగే డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకుని వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటోంది
వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
యువపారిశ్రామిక వేత్తలు దీనిని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహన్ని అందిస్తోంది
ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 26 జిల్లాలను 28కి ప్రభుత్వం పెంచింది.
భూమి రికార్డులను డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భద్రపరచటంతో పాటు సర్వే ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తోంది
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయటంతో పాటు 22 ఏ కింద పెట్టిన భూములను ప్రభుత్వం సమీక్షిస్తోంది.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. గత పాలకులు వదిలి వెళ్లిన చెత్తను తొలగించి సర్క్యులర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తోంది
మన మిత్ర వాట్సప్ ద్వారా ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలను దగ్గర చేసింది రాష్ట్ర ప్రభుత్వం
18 ఏళ్ల వయసు లోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది
ఆర్ధిక ఒత్తిళ్లు, బాధ్యతలూ ఉన్నా క్రమశిక్షణతో ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది
2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు చేరింది
వ్యవసాయంలో వృద్ధి 7.83 శాతం నమోదైంది. పరిశ్రమల రంగం 9.73 శాతం, సేవల రంగం 12.94 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్రగవర్నర్
వీటిని ఉపయోగించుకుని ఈ రంగంలో పెద్దఎత్తున ప్రాజెక్టులు సాధించేలా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం
సాగునీటి రంగం అభివృద్ధిలో కీలకంగా మారింది. తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం లాంటి ప్రాంతాలు హార్టీ కల్చర్ హబ్‌గా మారుతున్నాయి
పీఎం ప్రణామ్ పథకం ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని మెరుగుపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
పొగాకు, కోకో వంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ప్రభుత్వం ఆదుకుంది.
2030 నాటికి అరకు కాఫీ, కోకో ప్రాసెసింగ్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.