విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవడం తెలిసిందే. అయితే వాటికి ఆయన స్పందించడంతో ఫుల్ స్టాప్ పడుతోంది. ఇటీవల ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ మూవీకి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దృశ్యం సీక్వెల్ పై కూడా ఆయన స్పందించారు. ‘దృశ్యం-3’ హిందీ వెర్షన్ లో ఆయన నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించారు. తాను ఈ మూవీలో భాగమైనట్లు తెలిపారు. ఈ ఆసక్తికరమైన ఫ్రాంచైజీ #Drishyam3 హిందీ షూటింగ్లో పాల్గొనడం మొదలుపెట్టాను. అద్భుతమైన టీమ్ మరియు ఒక అద్భుతమైన పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. (మరియు నేను ఎవరినీ రీప్లేస్ చేయడం లేదు..) అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ దృశ్యం చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.