ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవం:అల్లు అర్జున్ టీమ్ క్లారిటీ

Spread the love

మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. బన్నీని కలవడానికి అనేక స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని ఓ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో, ఈ అంశంపై అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది. అల్లు అర్జున్‌ను కలవడానికి 42 రూల్స్ పాటించాల్సి ఉంటుందని ఆ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ గారి గురించి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవం. ఆయన ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా మరియు మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అందరినీ కోరుతున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలన్నీ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.