శాసన సభా విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు విద్యార్థులతో మాట్లాడారు. శాసనసభలో సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరును, ప్రజాప్రతినిధుల చర్చలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఈ అరుదైన అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. మార్చి 7 వరకు ఈ సమావేశాలు నిర్వహించాలని అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15,16 సెలవు కాగా, 17,18 తేదీలలో బడ్జెట్ పై చర్చ జరపనున్నారు. 18న ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. ఫిబ్రవరి 24,25,26 తేదీలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఇక మార్చి 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.