టీ 20 వరల్డ్ కప్: నమీబియా పై భారత్ ఘన విజయం

Spread the love

టీ 20 వరల్డ్ కప్ లో పసికూన నమీబియాపై డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 61 (24;6×4, 5×6) విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగాడు. హార్దిక్ పాండ్య 52(28; 4×4, 4×6) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. తిలక్ వర్మ (25), శివమ్ దూబే (23), సంజూ శాంసన్ (22) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో నమీబియా భారత బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది.వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ 2 వికెట్లు, బుమ్రా, శివమ్ దూబే, అర్ష్ దీప్ సింగ్ ఒక్కో వికెట్  చొప్పున తీశారు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఆడిన 2 మ్యాచ్ లలోనూ విజయాలు నమోదు చేసింది. మొదటి మ్యాచ్ లో యూ.ఎస్.ఏ పై గెలిచిన సంగతి తెలిసిందే.