మహిళల అకౌంట్ కు రూ.5వేలు..తమిళనాడు సీఎం గుడ్ న్యూస్

Spread the love

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. కలైంగర్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున రాష్ట్రంలోని 1.3 కోట్ల మంది మహిళల అకౌంట్స్ లో  డబ్బు జమ చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో రూ.2,000 సమ్మర్ స్పెషల్ అని తెలిపారు. ప్రతినెలా మహిళలకు అందించే రూ.1000 ఆర్థిక సహాయాన్ని ముందుగానే అందించినట్లు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలలో స్త్రీలకు ఇవ్వాల్సిన రూ.3 వేలకు మరో రూ.2000 కలిపి మొత్తం రూ.5వేలు మహిళల ఖతాలలో జమ చేసినట్లు స్టాలిన్ తెలిపారు. మహిళలకు ఫైనాన్సియల్ సపోర్ట్, సంక్షేమం, సాధికారత, స్వయంఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశమన్నారు. ఎన్నికల పేరుతో కొందరు ఈ పథకాన్ని అడ్డుకుంటున్నారని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకేకి మద్దతివ్వాలని మహిళలను కోరారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎన్నికల నియమావళి) అమల్లోకి వస్తే మహిళలకు అందే ఆర్థిక సాయం ఆగకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు చెల్లింపు చేసినట్లు తెలుస్తోంది.