అమరావతి- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. 2019 -24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖ వెళ్తే పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు… గతంలో మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తులు ఇప్పుడు నీతులు చెబుతున్నారు ప్రజలు ప్రతీ అంశాన్నీ గమనిస్తూనే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వస్తూనే 7 శ్వేత పత్రాలను విడుదల చేశాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేస్తు్న్నానుసంక్షేమం- అభివృద్ధి సమతూకంగా సుపరిపాలనను అందిస్తున్నామన్నారు. నెలకు రూ.2,750 కోట్ల రూపాయల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా అందిస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నాం.తల్లికి వందనం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకూ 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం.అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారందరినీ ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయి. సంపద ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలం… సంపద పంచగలం. అందుకే జీరో పావర్టీ ద్వారా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టామని అన్నారు. అట్టడుగుస్థాయిలో ఉన్న వారికి చేయూత అందించేందుకే పీ4 కార్యక్రమమని స్పష్టం చేశారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్వాంటం నైపుణ్యాల కోసం కోర్సు నిర్వహిస్తుంటే 60 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.ప్రస్తుతం ఇంధన రంగంలో ట్రాన్సిషన్ సయమం నడుస్తోంది. హరిత ఇంధనానికి డిమాండ్ ఉంది.గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి ఏపీ, మహారాష్ట్ర ఓ మోడల్ అవుతాయి.ఏపీలో ప్రొజ్యూమర్ విధానంలో ఇంధన ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాం. సోలార్ ప్యానళ్లను ఇళ్లపై ఏర్పాటు చేసుకుని గ్రిడ్ కు అనుసంధానిస్తాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్య సేవలను విస్తృతం చేస్తాం.మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ఏడాదిలోగానే టీచర్లకు పోస్టింగులు ఇచ్చాం.కానిస్టేబుళ్ల నియామకాలు కూడా పూర్తి చేసి స్టైఫండ్ ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచాం.విశాఖలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ పరిశ్రమలు వస్తున్నాయి. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాయి.రామాయపట్నం వద్ద బీపీసీఎల్ కూడా రూ.70 వేల కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది.భాగస్వామ్య సదస్సులో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు 610 ఎంఓయూలు చేసుకున్నాం.మొత్తంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి.20 లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు.