తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయం..సీఎం రేవంత్ కు ప్రియాంక గాంధీ అభినందనలు 

Spread the love

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ విజయానికి సంబంధించి లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అగ్రనేత  శ్రీమతి ప్రియాంక గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై శ్రీమతి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.