ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026: పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం

Spread the love

భారత్ మరోసారి ఐసీసీ ఈవెంట్స్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా నేడు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 (40; 10×4, 3×6) హాఫ్ సెంచరీతో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ 32 (29; 3×4), శివమ్ దూబే 27 (17; 3×4, 1×6), తిలక్ వర్మ 25 (24; 2×4, 1×6) పరుగులు చేయడంతో భారత్ బ్యాటింగ్ కు కొంచెం టఫ్ గా అనిపిస్తున్న పిచ్ పై 175 పరుగులు చేయగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్ 3 వికెట్లు తీశాడు. సల్మాన్ అఘా, ఉస్మాన్ తారీఖ్, షాహీన్ అఫ్రిదీ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 18 ఓవర్లలోనే 114 పరుగులకే ఆలౌటయింది. ఉస్మాన్ ఖాన్ 44 (34; 6×4, 1×6) టాప్ స్కోరర్. షాహీన్ అఫ్రిదీ 23 నాటౌట్ (19; 2×4, 1×6) లు మినహా మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి నిలువలేక పోయారు. హార్దిక్ పాండ్య, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ తీశారు.

భారత్ ఇన్నింగ్స్:
ఇషాన్ కిషన్ 77 (40; 10×4, 3×6) (బి) సైమ్ అయుబ్
అభిషేక్ శర్మ 0 (4) (సి) షాహిన్ అఫ్రిది (బి) సల్మాన్ అఘా
తిలక్ వర్మ 25 (24; 2×4, 1×6) ఎల్బీడబ్ల్యూ (బి) సైమ్ అయుబ్
సూర్య కుమార్ యాదవ్ 32 (29; 3×4) (సి) సైమ్ అయుబ్ (బి) ఉస్మాన్ తారీఖ్
హార్థిక్ పాండ్య 0 (1) (సి) బాబర్ అజామ్ (బి) సల్మాన్ అయుబ్
శివమ్ దూబే 27 (17; 3×4, 1×6) రనౌట్ (మహ్మద్ నవాజ్/ ఉస్మాన్ తారీఖ్)
రింకూ సింగ్ 11 నాటౌట్ (4; 1×4, 1×6)
అక్షర్ పటేల్ 0 (1) (సి) సైమ్ అయుబ్ (బి) షాహీన్ అఫ్రిదీ
అదనపు పరుగులు:3
మొత్తం: 175-7 (20 ఓవర్లు).

పాకిస్తాన్ ఇన్నింగ్స్:
సాహిబ్జాదా ఫర్హాన్ 0 (4) (సి) రింకూ సింగ్ (బి) హార్థిక్ పాండ్య
సైమ్ అయుబ్ 6 (2; 1×6) ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా
సల్మాన్ అఘా 4 (4; 1×4) (సి) హార్థిక్ పాండ్య (బి) బుమ్రా
బాబర్ అజామ్ 5 (7) (బి) అక్షర్ పటేల్
ఉస్మాన్ ఖాన్ 44 (34; 6×4, 1×6) (స్టంపింగ్) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ పటేల్
షాదాబ్ ఖాన్ 14 (15; 1×4) (సి) శివమ్ దూబే (బి) తిలక్ వర్మ
మహ్మద్ నవాజ్ 4 (5; 1×4( (సి) శివమ్ దూబే (బి) కుల్దీప్ యాదవ్
ఫహీమ్ అష్రాఫ్ 10 (14; 1×4) (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ చక్రవర్తి
షాహీన్ అఫ్రిదీ 23 నాటౌట్ (19; 2×4, 1×6)
అబ్రర్ అహ్మద్ 0 (1) ఎల్బీడబ్ల్యూ (బి) వరుణ్ చక్రవర్తి
ఉస్మాన్ తారీఖ్ 0 (3) (బి) హార్థిక్ పాండ్య.