బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం

Spread the love

ఏపీ పర్యటనకు వచ్చిన ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మీయంగా స్వాగతం పలికారు. దీనికి బదులుగా హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ పలకరించారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ అడిగారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులను, సీఎస్ విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్‌కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు.