ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుండగా, ఆ ఇల్లు అంతా ఆనందోత్సాహాలతో కళకళలాడుతోంది. శిరీష్ తన ప్రియురాలు నయనిక మెడలో మూడు ముళ్లు వేసే ఈ వేడుకను మార్చి 6న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే ఇదే రోజున గతంలో అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి వివాహం కూడా జరిగింది. అందుకే ఈ తేదీ అల్లు కుటుంబానికి ఎంతో స్పెషల్, మరింత సెంటిమెంట్ కూడా కలిగింది. ఐతే శిరీష్ తన పెళ్లి డేట్ ని పిల్లలతో కలిసి రీల్ చేయడం సూపర్ గా ట్రెండ్ అయ్యింది ఇక ఇప్పటికే ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇక నెక్స్ట్ సంప్రదాయబద్ధంగా నిర్వహించిన హల్దీ కార్యక్రమం వేడుకల్లో కనిపించిన చిరు కుటుంబం కూడా సందడి చేసింది! ఇక పెళ్లి శుభలేఖల పంపిణీ కూడా ప్రారంభమైంది. మన తెలుగు సంప్రదాయం ప్రకారం తొలి ఆహ్వాన పత్రికను కుటుంబంలో పెద్దవారికి అందించడం ఆనవాయితీ. అదే విధంగా శిరీష్ తన మావయ్య, మెగాస్టార్ చిరంజీవి ఇంకా అత్తయ్య సురేఖలకు మొదటి పత్రికను అందించి వారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అభిమానుల దృష్టి వెంటనే దానిపై పడింది. అయితే ఆ ఫోటోలో చిరంజీవి భుజానికి సపోర్ట్ బ్యాగ్ ధరించి కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయనకు గాయం అయ్యిందా? ఇటీవల శస్త్రచికిత్స జరిగిందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. కుటుంబ సభ్యుల నుంచి అధికారిక సమాచారం వెలువడకపోయినా, అభిమానులు మాత్రం మెగాస్టార్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.