దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల సందర్శనార్థం ఏప్రిల్ 22న తిరిగి తెరచుకోనున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శీతాకాలం నేపథ్యంలో దాదాపు 6 నెలలుగా మూసి వేశారు. ఈ ఆలయాన్ని ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పంచాంగం, హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. దీంతో గర్వాల్ హిమాలయాల్లో చార్ధామ్ యాత్ర షెడ్యూల్ కుడా ఖరారైంది. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19న అక్షయ తృతీయ నాడు తిరిగి తెరచుకోనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ (యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్) క్షేత్రాలు హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాలను సందర్శిస్తారు.