భారీ లాభాలతో నేటి ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు  

Spread the love

ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్లతో సూచీలు దూసుకెళ్లాయి. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 650 పాయింట్ల లాభంతో  83,277 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి  25,682 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.66గా కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడం మార్కెట్‌ కు బలాన్ని ఇచ్చింది. వ్యూహాత్మక కొనుగోళ్లు: గత వారం నష్టాల తర్వాత, తక్కువ ధరలో దొరుకుతున్న క్వాలిటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, మన దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు  మార్కెట్‌ను ఆదుకున్నారు. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో హెచ్.డి.ఎఫ్.సీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.