కాంగ్రెస్ కు 5, బీజేపీ, సీపీఐ లకు ఒక్కో కార్పోరేషన్ 

Spread the love

తెలంగాణలో 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. బీజేపీ, సీపీఐ లు ఒక్కో కార్పోరేషన్ ను కైవసం చేసుకున్నాయి. రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్, కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ, కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ గెలుచుకున్నాయి. మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, నల్గొండలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లభించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీకి అవకాశాలు ఉన్నప్పటికీ, మజ్లిస్ పార్టీ మద్దతుతో దీనిని కాంగ్రెస్ దక్కించుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌గా 49వ వార్డు కార్పొరేటర్ ఉమారాణి, డిప్యూటీ మేయర్‌గా మజ్లిస్ పార్టీ 54వ వార్డు కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నుకోబడ్డారు. కోరం లేని కారణంగా 11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, జనగాం,  క్యాతనపల్లి, ఖానాపూర్, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్,జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు.