ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం

Spread the love

టీ 20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మరో ఓటమి చవిచూసింది. జింబాబ్వేతో ఓటమి పాలైన ఆస్ట్రేలియా తాజాగా శ్రీలంక చేతిలో 8వికెట్ల తేడాతో ఘోర  పరాజయం చెందింది. మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 56 (29; 7×4, 3×6), మిచెల్ మార్ష్ 54 (27; 8×4, 2×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. జోష్ ఇంగ్లిస్ (27), గ్లెన్ మ్యాక్స్ వెల్ (22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత 3 వికెట్లు, దుష్మంత్ చమీర 2 వికెట్లు, తీక్షణ 1 వికెట్, వెల్లలాగే 1 వికెట్, మెండీస్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది. పాతుమ్ నిస్సంకా 100 నాటౌట్ (52; 10×4, 5×6) సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కుశాల్ మెండీస్ 51 (38; 6×4, 1×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పవన్ రత్ననాయకే (28 నాటౌట్) పరుగులు చేశారు. మార్క్ స్టోయినీస్ 2 వికెట్లు తీశాడు.  పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా శ్రీలంకకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. శ్రీలంక వరుసగా మూడో విజయంతో సూపర్-8లోకి దూసుకెళ్లింది.