మాజీ సీఎం కె.సి.ఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

Spread the love

తెలంగాణ మాజీ సీఎం కె.సి.ఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి:

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఏపీ సీఎం చంద్రబాబు:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:

కె.సి.ఆర్. గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బి.ఆర్.ఎస్. అధ్యకులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడాయన. మరింతగా సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను శ్రీ కె.సి.ఆర్. గారికి అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

ఏపీ మంత్రి లోకేష్: 

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను.