సస్పెన్స్ మధ్య కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీ.ఆర్.ఎస్ కాంగ్రెస్ లకు సమానంగా బలాబలాలు ఉన్న నేపథ్యంలో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్ కు చెందిన ఛైర్మన్ అభ్యర్థుల పేర్లు రావడంతో రెండు మున్సిపాలిటీలు హస్తం పార్టీ కైవసం చేసుకుంది.
జనగామలో బీ.ఆర్.ఎస్ 13 చోట్ల విజయం సాధించింది. ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతిచ్చారు. ఆ పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియోగా ఉండడంతో బలం 16కు పెరిగింది. మిత్రపక్షమైన సీపీఎం (1)తో కలిపి 13 వార్డులు గెలిచింది. ఇద్దరు ఇండిపెండెంట్ లు మద్దతిచ్చారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో పార్టీ బలం 16కు చేరింది. దీంతో లాటరీ తీసి గెలుపును నిర్ణయించారు.
ఇక తొర్రూర్ లో మొత్తం 16 వార్డుల్లో బీ.ఆర్.ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి కాంగ్రెస్ బలం 9కి పెరిగి రెండు పార్టీల నెంబర్లు సమానమయ్యాయి. దీంతో అధికారులు లాటరీ ద్వారా ఛైర్మన్ ను నిర్ణయించారు.
ఇక డోర్నకల్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. కోరం లేక నిన్న వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో నేడు ఎన్నిక నిర్వహించారు. మొత్తం 15 వార్డులకు కాంగ్రెస్ 11 చోట్ల గెలిచింది. నేడు జరిగిన చైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకుంది.