కమల్ ‘మక్కల్ నీది మయమ్’ కు ‘టార్చిలైట్’ సింబల్

Spread the love

ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్థాపించిన ‘మక్కల్ నీది మయమ్’ పార్టీకి భారత ఎన్నికల సంఘం ‘టార్చిలైట్’ సింబల్ ను ఖరారు చేసింది. పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఈ గుర్తును కేటాయించినట్లు నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక దీంతో అక్కడ అన్ని స్థానాల్లో ఈ సింబల్ తో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు సింబల్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎలక్షన్ కమీషన్ ఇటీవల తెలిపింది. తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుతో ఆ పార్టీ పోటీచేయనుంది. 2018లో కమల్ హాసన్ ఈ పార్టీని పెట్టారు.