పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలా దేవి ఇంట్లో చోరీ జరిగింది. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. 40 సవర్లకు పైగా బంగారం, 10 కిలోల వెండి, లక్ష రూపాయలు నగదు దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ఇంటిని క్లూస్ టీమ్ పరిశీలించింది. ప్రస్తుతం ప్రమీలాదేవి గుంటూరులోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో ఉంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.