‘బయోఏషియా’ సదస్సును ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

ఈ రోజు హైటెక్స్‌లో ‘బయోఏషియా’ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  హైదరాబాద్ గత 23 ఏళ్లుగా బయోఏషియాకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వకారణం, ఇది త్వరలోనే గ్లోబల్ “బయో వరల్డ్” సదస్సుగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నేడు ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా నిలుస్తోంది. గత రెండేళ్లలోనే మేము లైఫ్ సైన్సెస్ రంగంలో ₹73,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాము. ఇటీవల దావోస్‌లో మా నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించాము, “వన్-బయో” (One-Bio) ను ప్రారంభించాము, గ్రీన్ ఫార్మా సిటీ పనులను వేగవంతం చేశాము మరియు ప్రముఖ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని పేర్కొన్నారు. మన  “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ ద్వారా, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మరియు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు మరియు ప్రభుత్వాల మధ్య బలమైన భాగస్వామ్యంతో ఈ లక్ష్యం ఖచ్చితంగా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ స్థిరమైన, ఆవిష్కరణలతో కూడిన పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది. హైదరాబాద్‌ను కేవలం వ్యాక్సిన్ రాజధానిగానే కాకుండా, ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మార్చే క్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.