ప్రశాంత్ వర్మ… ఈ యంగ్ డైరెక్టర్ కి టాలీవుడ్ లో మంచి పేరు ఉంది… ఫస్ట్ లో నలుగురు ట్రేండింగ్ హీరోయిన్స్ తో కలిసి AWE సినిమా చేసి, WOW అనిపించాడు. నెక్స్ట్ రాజశేఖర్ తో కల్కి సినిమా చేసి, ఆయనకి సూపర్ హిట్ ఇచ్చాడు. నెక్స్ట్ తేజ సజ్జ తో zombie రెడ్డి సినిమా చేసి, కొత్త కాన్సెప్ట్ పరిచయం చేసాడు. నెక్స్ట్ తేజ తోనే హనుమాన్ సినిమా చేసి సూపర్ బ్లాక్బస్టర్ కొట్టాడు… ఇక ఆ సినిమా తరవాత వరుస ఆఫర్స్ వచ్చి పడ్డాయి… ఆలా ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యాడు! బాలయ్య కొడుకు ఫస్ట్ సినిమా సింబ లైన్ లో ఉంది. అలానే HANUMAN సీక్వెల్ జై HANUMAN సినిమా కాంతారా హీరో రిషబ్ శెట్టి తో చేస్తున్నాడు! ఇలా ఇంకో భారీ ఆఫర్ కూడా చేతిలో ఉందంట! అయితే ఇప్పుడు రూపొందుతున్న జై హనుమాన్ పూర్తిగా భిన్నమైన స్థాయిలో ప్లాన్ అవుతోంది. ఈసారి భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా హీరోగా రిషబ్ షెట్టి చేరడం సినిమాకు కొత్త స్థాయి తీసుకొచ్చింది. ఇక సినిమాలో కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటి ను ఎంపిక చేచేసినట్లు ఇండస్ట్రీ బజ్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.రానా ఎంచుకునే పాత్రలు సాధారణంగా కథలో బలమైన కథ ని కలిగి ఉంటాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు అదనపు బలం ఇస్తాయి. దీంతో జై హనుమాన్ కేవలం సీక్వెల్‌గా కాకుండా, భారీ మల్టీ స్టారర్ అనే ఇమేజ్ తో ముందుకు సాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే జై హనుమాన్ ఒక సాధారణ సీక్వెల్ కాదు: భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, ప్రముఖ టెక్నీషియన్లు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణం, ఈ అన్ని అంశాలు కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది.