యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్ గురించి అభిమానుల్లో రోజురోజుకు ఉత్సాహం పెరుగుతోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా అవుతుందని తాజా సమాచారం చెబుతోంది. మొదట్లో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందేమో, విడుదల తేదీ అనుకున్న టైం కి రిలీజ్ అవ్వకపోవచ్చు అన్న సందేహాలు వినిపించాయి. ముఖ్యంగా 2027లోనే విడుదల కావచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా పరిణామాలు చూస్తే ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం చిత్ర బృందం జోర్డాన్‌లో ఒక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో ఉంది. ఈ షెడ్యూల్లో సినిమాకు హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. అందుకే ఈ భాగం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇదే చిత్రానికి సంబంధించిన చివరి ప్రధాన అవుట్డోర్ షూట్ కావచ్చని చెబుతున్నారు.ఈ షెడ్యూల్ పూర్తయ్యాక మిగిలిన భాగాన్ని మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే పట్టుదలతో నిర్మాతలు పనిచేస్తున్నారని తెలుస్తోంది. అన్ని పనులు ప్రణాళిక ప్రకారం సాగితే త్వరలోనే అధికారిక విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ శైలిలో ఉండే భారీ యాక్షన్ డ్రామా, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ఈ రెండూ కలిస్తే సినిమా స్థాయి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా అభిమానులు ఈ సినిమాను ఒక మాస్ విజువల్ అనుభూతిగా చూడాలని ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. కొత్త జోడీగా ఎన్టీఆర్–రుక్మిణి వసంత్ తెరపై ఎలా కనిపిస్తారో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.