ధర్మవరం కోర్టుకు బాంబు బెదిరింపు..పోలీసుల తనిఖీలు 

Spread the love

ధర్మవరం కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో  జడ్జిలు న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. డి.ఎస్.పి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ కోర్టులో  తనిఖీలు చేశారు. ఇది సంఘ విద్రోహుల నుంచి వచ్చిన మెయిలా లేక ఆకతాయిలు చేసిన పనా అనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.  ఈ బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పైన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరాతీస్తున్నారు. గతంలో కూడా ఇలా అనేకసార్లు కోర్టులును బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈమెయిల్ బాంబు బెదిరింపు లేఖలతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *