రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల..!

Spread the love

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్ల కేసులో బెయిల్ రావడంతో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుండి విడుదలయ్యారు. వైసీపీ నేత, మాజీ మంత్రి  అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది.  సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న కేసులో బెయిల్ మంజూరైంది. 2023 సత్తెనపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో అంబటికి బెయిల్ వచ్చింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రెండు కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరైంది.  జనవరి 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.  సీఎం చంద్రబాబును దూషించిన కేసు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసుల్లో ఇప్పటికే అంబటికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *