జపాన్ ప్రధాన మంత్రిగా  సానే తకాయిచి..భారీ విజయంతో అధికార పీఠం కైవసం

Spread the love

పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి జపాన్ ప్రధాన మంత్రిగా  సానే తకాయిచి మళ్ళీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. రేర్ మెటల్స్, ఇతర ఆర్థిక అంశాల్లో అమెరికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో స్నేహాన్ని మరింత పటిష్టం చేసుకుంటామనీ తెలిపారు. గత వారం వెలువడిన పార్లమెంటు దిగువ సభ ఎన్నికల రిజల్ట్స్ లో  తకాయిచి నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. దీంతో ఎగువ సభలో మెజారిటీ లేకపోయినా ఆమె ప్రభుత్వం బిల్లులను నిరాటంకంగా పాస్ చేయించుకునే  అవకాశం ఉంది. మొత్తం 465 సీట్లలో తకాయిచి కూటమి 350 కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. ఇది జపాన్ రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలో ఒక పార్టీ సాధించిన అతిపెద్ద విజయం.ఎగువ సభలో స్పష్టమైన మెజారిటీ లేకపోయినా, దిగువ సభలో ఉన్న ఈ 2/3వ వంతు మెజారిటీతో ఆమె ప్రభుత్వం ఎగువ సభ తిరస్కరించిన బిల్లులను కూడా తిరిగి ఆమోదించుకునే అధికారాన్ని పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *