పరువు నష్టం కేసులో భివండీ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

Spread the love

మహారాష్ట్రలో నమోదైన ఒక పరువు నష్టం కేసులో బెయిల్ కు సంబంధించి కొత్త గ్యారెంటీ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భివండీ  మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసులో మహారాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ హర్షవర్ధన్ ను తన గ్యారెంటీదారుగా పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు గ్యారంటర్ గా ఉన్న మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ గతేడాది మరణించారు. దీంతో ఆయన స్థానంలో కొత్త గ్యారంటర్ పేరును నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యారు. 2014 లోక్ సభ ఎలక్షన్ సందర్భంగా మహారాష్ట్ర లోని సోనాలే గ్రామంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  ఆ సందర్భంగా మహాత్మా గాంధీ హత్యలో ఆర్.ఎస్.ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు ఆర్.ఎస్.ఎస్. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని అప్పట్లో సంఘ్ కార్యకర్త రాజేష్ కుంటే భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *