ప్రజలతో మమేకమై జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్లండి

Spread the love

ప్రజలతో మమేకమై జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్లాని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన నాయకులకు సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు … పార్టీ సభ్యత్వ నమోదును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రణాళికపై టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమష్టిగా రెండు వారాల సమయాన్ని వినియోగించుకుందామని పేర్కొన్నారు. సభ్వత్వ నమోదును అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం, వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీకి బలాన్ని సమీకరించేలా ఈ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సమన్వయం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారని తెలిపారు. జనసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై సమన్వయకర్తలతో ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద క్షేత్రస్థాయి నుంచి పక్కా ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *