రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో ఎంపీ పురంధేశ్వరి బాధితులను పరామర్శించారు. కిమ్స్, రెయిన్ బో,ఆదిత్య, యూనివర్సల్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను, చిన్నారులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులతో ఎంపీ సమీక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని వైద్యులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం మరియు యంత్రాంగం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.